స్పిన్నర్లు చుట్టేశారు
- 118కే దక్షిణాఫ్రికా ఆలౌట్
- రెండో వన్డేలో 9 వికెట్లతో భారత్ విజయం
- 2-0తో సిరీస్ ఆధిక్యం
- చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
- సొంత గడ్డపై సఫారీల అత్యల్ప స్కోరు
- కోహ్లి సేన రికార్డు గెలుపు
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. భారత స్పిన్ ద్వయం యుజవేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు 32.2 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌటయింది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే వన్డేల్లో అత్యల్ప స్కోరు. 8.2 ఓవర్లలో 22 పరుగులకు 5 వికెట్లు సాధించిన చాహల్ తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ 6 ఓవర్లలో 20 ఓవర్లుకు మూడు వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఒక్కొ వికెట్ సాధించారు.
దక్షిణాఫ్రికా విధించిన 118 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 20.2 ఓవర్లలో అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు (17 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు) చేసి నాలుగో ఓవర్‌లో రబడ బౌలింగ్‌లో మోర్కల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శిఖర్ ధావన్ 51 పరుగులు (56 బంతుల్లో 9 ఫోర్లు), విరాట్ కోహ్లి 46 పరుగులు (50 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు)తో నాటౌట్‌గా వున్నారు. ఈ విజయంతో 6 వన్డేల ఈ సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే ఈ నెల 7న కేప్‌టౌన్‌లో జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత్ దక్షి ణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వా నించింది. హషీమ్ అమ్లా (23 పరుగులు, 32 బంతుల్లో నాలుగు ఫోర్లు)ను తొలి వికెట్‌గా భువనేశ్వర్ పెవిలియన్‌కు పంపాడు. తరువాత జట్టు స్కోరు 51 పరుగుల వద్ద డికాక్‌ను (20 పరుగులు, 36 బంతుల్లో రెండు ఫోర్లు)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. ఇదే స్కోరు వద్ద కెప్టెన్ మార్క్రమ్ (8), డేవిడ్ మిల్లర్ (0)ను వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా 51 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును జెపి డుమిని, ఖేయా జొండో అదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే జట్టు స్కోరు 99 వద్ద జొండో (25 పరుగులు), 107 పరుగులు వద్ద డుమిని (25 పరుగులు)ను చాహల్ అవుట్ చేశాడు. తరువాత క్రిస్ మోరిస్ (14 పరుగులు), రబడ (1), తాహిర్ (0), మోర్కల్ (1) త్వరగా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. తబ్రైజ్ షమ్సి (0) నాటౌట్‌గా వున్నాడు. దక్షిణాఫ్రికా చివరి మూడు వికెట్లను కేవలం 6 బంతుల్లోనే కోల్పోయింది.
సొంత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే వన్డేల్లో అత్యల్ప స్కోరు. 2009లో ఎలిజబెత్‌లో ఇంగ్లాండ్ చేతిలో 119 పరుగులకు ఆలౌటయింది. 8.2 ఓవర్లలో 22 పరుగులకు 5 వికెట్లు సాధించిన చాహల్ తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. కెరీర్‌్‌లో 19వ వన్డేలో ఆడిన చాహల్‌కు 5 వికెట్లు సాధించడం ఇదే మొదటిసారి. అలాగే దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఇమ్రాన్ తాహిర్ వెస్టిండీస్‌పై 28 పరుగులకు నాలుగు వికెట్లు సాధించిన రికార్డును చాహల్ అధిగమించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ త్వరగా ముగియడంతో భారత్ చాలా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ 15 పరుగులకే రనౌటైనా ధావన్-కోహ్లి జోడీ అజేయంగా లక్ష్యాన్ని చేధించింది. కాగా భారత్ విజయానికి మరో రెండు పరుగులు దూరంలో వుండగా నిబంధనల ప్రకారం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. లక్ష్యాన్ని 20.3 ఓవర్లలో అందుకున్న భారత్ కొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక బంతులు (177 బంతులు) మిగిలి వుండగానే విజయం సాధించిన జట్టుగా నిలిచింది. 2000లో కేప్‌టౌన్‌లో 153 బంతులు వుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించిన రికార్డును భారత్ అదివారంతో ఆధిగమించింది.

No comments:
Post a Comment