బంగ్లా-లంక తొలి టెస్టు డ్రా
- రెండు సెంచరీలతో హక్ రికార్డు
చిట్టాంగ్ : శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డ్రాగా ముగించింది. చివరి రోజు ఆటలో మోమినుల్ హక్ సెంచరీ (105) చేయగా, లిటాన్ దాస్ 94తో జట్టును అదుకున్నారు. దీంతో అదివారం ఆటముగిసే సరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. మూడు వికెట్ల నష్టానికి 81 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో అదివారం ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ శ్రీలంక బౌలర్లు సమర్థవతంగా ఎదుర్కొంది. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఈ టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 713 పరుగులు వద్ద డిక్లైర్డ్ చేసింది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులకు ఆలౌటయింది. హక్ 176 పరుగులు చేశాడు. ఈ టెస్టుతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా హక్ రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు ఈ నెల 8న ప్రారంభమవుతుంది.

No comments:
Post a Comment