కోహ్లి నుంచి రహానే నేర్చుకోవాలిః సౌరవ్
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరిలోకీ రహానే క్లాస్ ప్లేయర్ అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ చేసిన శతకం విలువైనదే అయినప్పటికీ.. రహానే ఆడిన ఇన్నింగ్స్ ఇంకా విలువైనదని సౌరవ్ అన్నాడు.
`రహానేది చాలా సొగసైన బ్యాటింగ్. అతను ఆడుతున్నప్పుడు చూడడం బాగుంటుంది. అయితే అతను అర్థశతకాలను సెంచరీలుగా మలుచుకోవడంలో తడబడుతుంటాడు. సెంచరీలు ఎలా చేయాలో కోహ్లీని చూసి రహానే నేర్చుకోవాలి. కోహ్లీ ఒక్కసారి కుదురుకుంటే తప్పకుండా సెంచరీ చేస్తాడు. కోహ్లీ నుంచి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలో రహానే నేర్చుకోవాల`ని గంగూలీ సూచించాడు.

No comments:
Post a Comment