అండర్-19 ప్రపంచకప్ విజేత భారత్
అండర్-19 ప్రపంచకప్ విజేత భారత్
మౌంట్ మంగనుయ్ : అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. నాలుగోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచి పృథ్వీషా సేన రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఓటమే ఎరగని రాహుల్ ద్రవిడ్ విద్యార్థులు తమ సత్తాను ప్రపంచానికి చాటారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ యువ భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 47.2 ఓవర్లలో ఆలౌట్ అయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత కుర్రాళ్లు కేవలం 38.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 220 పరుగులు చేశారు. మన్‌జోత్ కల్రా అద్భుతమైన శతకంతో భారత్‌కు విజయాన్ని అందించాడు.
No comments:
Post a Comment