2 పరుగుల కోసం 40 నిమిషాల బ్రేక్
సెంచూరియన్: 119 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్ విజయానికి మరో రెండు పరుగుల దూ రంలో అంపైర్లు లంచ్ విరామం ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే వారు ఐసీసీ నిబంధనలను అనుసరించే బ్రేక్ ప్రకటించినా రెండు పరుగుల కోసం 40 నిమిషాలపాటు ఆటగాళ్లు, ప్రేక్షకులు వేచి చూడాల్సి వచ్చింది. కానీ కామెంటేటర్స్, క్రికెట్ నిపుణులు ఈ తీరుపై విమర్శలు గుప్పించారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32.2 ఓవర్లలోనే ముగియడంతో భారత జట్టు వెంటనే తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఆ తర్వాత 19 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 117 పరుగులు చేయగా రూల్స్ ప్రకారం అంపైర్లు మ్యాచ్‌ను ఆపారు. కానీ కేవలం 2 పరుగుల కోసం అంతసేపు విరామం ప్రకటించడం అందరినీ అసహనానికి గురి చేసింది. కెప్టెన్ కోహ్లీ కూడా అసంతృప్తితో క్రీజును వదిలాడు. ఇక ఈ ప్రహసనంపై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపించాయి.
No comments:
Post a Comment