కోహ్లీతో ఆడటాన్ని గౌరవంగా భావిస్తాను!
డర్బన్: ఆతిథ్య దక్షిణఫ్రికాతో నిన్న జరిగిన తొలి వన్డేలో కోహ్లీ ఇన్నింగ్స్ చూసిన వారు ఎవరైనా వావ్ అనకుండా ఉండరు. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థులను సైతం అభిమానులుగా మార్చేసుకున్నాడు. సఫారీ బౌలర్ ఇమ్రాన్ తాహీర్.. కోహ్లీ ప్రదర్శన చూసి ఫిదా అయిపోయాడు. ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న కోహ్లీని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఫెలుక్వాయో బౌలింగ్‌లో 44.3వ ఓవర్ వద్ద విరాట్ కోహ్లీ(112, 119 బంతుల్లో) రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటి వరకు కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన బౌలర్ ఇమ్రాన్ తాహీర్ పరిగెత్తుకుంటూ కోహ్లీ వద్దకు వచ్చి అభినందించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతేకాదండోయ్ ఈ ఫొటోను తాహీర్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవం'గా భావిస్తున్నాను అని పేర్కొన్నాడు. ఇదే ఫొటోను పంచుకున్న ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అని పేర్కొంది. ఐపీఎల్‌లో ఇమ్రాన్ తాహీర్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకున్న విషయం తెలిపిందే.
ఇక సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే ఈ ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.
ఇక సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే ఈ ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.
No comments:
Post a Comment