Friday, 2 February 2018

కోహ్లీ.. నీకు ధన్యవాదాలు

కోహ్లీ.. నీకు ధన్యవాదాలు

కోహ్లీ.. నీకు ధన్యవాదాలు
దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకో తెలిస్తే షాకవ్వడం మీ వంతు అవుతుంది. ఇంతకీ ఎందుకు అనేగా మీ సందేహం. రహానెకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు తుది జట్టులో చోటు కల్పించని కోహ్లీ.. తొలి వన్డేలోనే ఆడించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అందుకే కోహ్లీకి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదండోయ్‌ భవిష్యత్తులోనూ నాలుగో స్థానంలో రహానెను దించాలని, ఈ స్థానానికి అతడు సెట్‌ అవుతాడని సలహాలు కూడా ఇచ్చారు.
*రహానెకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు కెప్టెన్‌. అతని బ్యాటింగ్‌ చూసి మైమరచిపోయాను. నంబర్‌ 4లో బ్యాటింగ్‌కు వచ్చే నువ్వు ఇక ఆ స్థానాన్ని రహానె కోసం త్యాగం చెయ్యి.
* బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లో శతకాలను తినే కోహ్లీ.. రహానె పట్ల దయ చూపించాడు.

ఎట్టకేలకు ఇండియాకు 4వ స్థానంలో బ్యాటింగ్‌ కోసం బెంగ తీరిపోయింది.
* 2019 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లో జరగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే రహానెను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేశారు. నంబర్‌ 4లో ఆడటంపైనే రహానె దృష్టి పెట్టాలి.
* రహానె స్థానంలో మనీశ్‌ పాండేను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. నాలుగో స్థానాన్ని రహానె మాత్రమే భర్తీ చేయగలడు.
* భారత్‌కు మంచి మిడిలార్డర్‌ కావాలంటే నాలుగో స్థానంలో రహానెను దింపాలి.
* రహానెను నుంచి జాలువారిన ఈ ఇన్నింగ్స్‌ చాలాకాలం గుర్తుండిపోతుంది.
డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రహానె 79 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.

No comments:

Post a Comment